Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియురాలి స్నానాల గదిలో సీసీకెమెరా ఏర్పాటుకు యత్నం.. బెడిసికొట్టిన వైనం!

  • ప్రియురాలు మాట వినడం లేదని భయపెట్టే యత్నం
  • సీసీ కెమెరా ఏర్పాటు చేస్తానని హెచ్చరిక
  • రాజీ కుదిర్చిన పంచాయితీ పెద్దలు
తాను చెప్పిన పనులు చేసేందుకు నిరాకరించిన ప్రియురాలిని వేధించాలనుకున్నాడో ప్రబుద్ధుడు. ఆమె స్నానాల గదిలో సీసీ కెమెరా పెట్టేందుకు యత్నించాడు. అయితే, ఈ విషయం యువతికి తెలియడంతో అతడి పన్నాగం బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే కోడూరులో జరిగిందీ ఘటన. గ్రామస్థుల కథనం ప్రకారం.. మండలంలోని శెట్టిగుంట పంచాయతీకి చెందిన ఓ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారు.

అయితే, ఏమైందో కానీ ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆమె తన మాట వినడం లేదన్న కోపంతో యువతి స్నానాల గదిలో సీసీ కెమెరా పెడతానని భయపెట్టాడు. దీంతో యువకుడిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారం బయటకు రావడంతో పెద్దమనుషులు పంచాయితీ పెట్టి రాజీ కుదిర్చారు. పోలీసులు మాట్లాడుతూ.. యువకుడి నుంచి పెన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నామని, అది పనిచేయడం లేదని అన్నారు. ఇరువురు రాజీకొస్తారన్న ఉద్దేశంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
Railway kodur
lover
CCTV

More Telugu News